కూకట్‌పల్లి నియోజకవర్గంలోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లో మంగళవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌తో కలకలం రేగింది. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ క్యాంపస్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందుజాగ్రత్తగా విద్యార్థులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రితిరాజ్ హెచ్చరించారు.