మోతీనగర్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

0చూసినవారు
మోతీనగర్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మోతీనగర్ చౌరస్తాలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తెలంగాణ తల్లి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలతో స్థాపితమైన బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతి, మోహన్ రెడ్డి, జోసెఫ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్