బుద్ధ పౌర్ణమి సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ సహకారంతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వద్ద “బుద్ధునితో ప్రతిధ్వని: ఉదయకాల సౌండ్ బాత్ అనుభవం” అనే ప్రత్యేక వెల్‌నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెల్‌నెస్ హీలర్, యోగా టీచర్, సౌండ్ థెరపిస్ట్ సాయి సంతోష్ తోట ఆధ్వర్యంలో జరిగే ఈ సెషన్, ప్రాచీన యోగ జ్ఞానాన్ని, చికిత్సాత్మక ధ్వని తరంగాలను మేళవించి శరీరం, మనసు, ఆత్మకు ప్రశాంతతను అందించనుంది.