రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ఒడిశా, విజయవాడ నుంచి నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకుంది. ఆల్విన్ కాలనీలో దాడులు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6.43 కిలోల గంజాయి, ఒక వేయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు కొనసాగుతోంది.