కంటి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ భరోసా

352చూసినవారు
కంటి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ భరోసా
కూకట్‌పల్లి నియోజకవర్గంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కాంగ్రెస్ నేత బండి రమేష్ అన్నారు. దయార్‌గూడకు చెందిన జిల్లెల రాణి కంటి చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేరగా, ఆమెకు మంజూరైన రూ. లక్ష ఎల్‌వోసీ పత్రాన్ని రమేష్ బాధితురాలి భర్త నరేందర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బండి రమేష్, జీవీఆర్‌కు నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్