ధరణి నగర్ నాల విస్తరణ పనులు వేగవంతం

1చూసినవారు
ధరణి నగర్ నాల విస్తరణ పనులు వేగవంతం
కూకట్‌పల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ ధరణి నగర్ పరిధిలో రూ. 8.76 కోట్ల వ్యయంతో చేపట్టిన నాల విస్తరణ పనులను పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ పరిశీలించారు. పరికి చెరువు అలుగు నుంచి ప్రేమ్ సరోవర్ అపార్ట్‌మెంట్స్ వరకు జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. వర్షాకాలానికి ముందే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన గాంధీ, నాణ్యతలో రాజీ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్‌సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణంతో లోతట్టు ప్రాంతాలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :