పేదల పొట్ట కొట్టొద్దు ఎమ్మెల్యే

1చూసినవారు
పేదల పొట్ట కొట్టొద్దు ఎమ్మెల్యే
కూకట్‌పల్లి నియోజకవర్గం భరత్ నగర్ కాలనీలో చిరు వ్యాపారుల షెడ్లను రోడ్ల విస్తరణ పేరుతో తొలగించడాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులను ఉద్దేశించి, పేదల జీవనాధారాలను ఏకపక్షంగా తొలగించవద్దని ఆయన ఆదేశించారు. బాధితులకు ప్రత్యామ్నాయంగా వెండింగ్ జోన్లు లేదా మార్కెట్ స్థలాలు కేటాయించాలని సీఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి సూచించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి అవసరమే అయినా పేదల బతుకుదెరువు దెబ్బతినకూడదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్