ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. తన తెలివితేటలకు ఆశ్చర్యపోయిన పోలీసులు సైబర్ క్రైమ్‌లో ఉద్యోగం ఆఫర్ చేసినా, దానిని రవి తిరస్కరించినట్లు సమాచారం. అంతేకాకుండా కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెట్టి, వచ్చిన డబ్బుతో జీవితాన్ని ఆనందంగా గడపడమే తన లక్ష్యమని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో అతనికి బెయిల్ లభించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.