కూకట్‌పల్లి ఏటీఎంలో అగ్నిప్రమాదం (వీడియో)

2చూసినవారు
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ వద్ద అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న DBS ఏటీఎం సెంటర్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you