కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఏ.ఎస్. రాజు నగర్‌లో ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా టీఎక్స్ హాస్పిటల్స్, అమెరికన్ ఐ కేర్, ఏషియన్ డెంటల్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరంలో
బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడంలో ఇలాంటి శిబిరాల ప్రాముఖ్యతను తెలిపారు. నిపుణులైన వైద్యులు రోగులకు ఉచితంగా
పరీక్షలు నిర్వహించి, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.