కూకట్‌పల్లి నియోజకవర్గంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో 27 అడుగుల ఎత్తైన రాతి ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. అనంతరం దేవస్థానంలో ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు.