జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థుల హరిత సంకల్పం

0చూసినవారు
జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థుల హరిత సంకల్పం
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లో శనివారం పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీహెచ్‌డీ స్కాలర్ చల్లా రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జేఎన్‌టీయూహెచ్ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్. సైదా నాయక్ ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్, భరత్ వీర్ యువత పచ్చదనం పెంపొందించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.