iBOMMA రవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. డిసెంబర్ 3కి వాయిదా

8చూసినవారు
iBOMMA రవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ.. డిసెంబర్ 3కి వాయిదా
సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ iBOMMA నిర్వాహకుడు రవిని పోలీసులు నాంపల్లి కోర్టు ముందు ఐదు కేసుల్లో హాజరుపరిచారు. ఈ కేసుల్లో పీటీ వారెంట్‌లకు కోర్టు అనుమతి లభించింది. రవి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై డిసెంబర్ 3న కోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎనిమిది రోజుల పాటు పోలీసులు రవిని ప్రశ్నించారు. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు త్వరలోనే బెయిల్‌ మంజూరు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసుల విచారణలో రవి పైరసీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని, సినిమాలకు సంబంధం ఉన్న ఏ పని చేయనని తెలిపినట్లు సమాచారం. 'iBOMMA' అనే పేరుకు సంబంధించి, 'i' అంటే ఇంటర్నెట్ అని, 'బొమ్మ' అంటే వైజాగ్ ప్రాంతంలో సినిమాను పిలిచే పదమని, 'ఇంటర్నెట్ బొమ్మ' అనే అర్థంలోనే పేరు ఉపయోగించినట్లు రవి వివరించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్