హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, మూసాపేట్, బోరబండ, పంజాగుట్ట, సనత్ నగర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.