తెలంగాణ రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఎండ ఉంటూనే ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం తెలంగాణలోని హైదరాబాద్ లో బుధవారం ఉదయం 8.30లోపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.