కూకట్ పల్లి: ఆర్జీవీ లేడీస్ హాస్టల్ లో ఇంత ఘోరమా?

82చూసినవారు
కూకట్ పల్లి: ఆర్జీవీ లేడీస్ హాస్టల్ లో ఇంత ఘోరమా?
కూకట్పల్లిలోని ఆర్జీవీ లేడీస్ హాస్టల్ ను శనివారం జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదని, నోటీసులకు సమాధానం కూడా ఇవ్వకపోవడంతో హాస్టల్ సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ హాస్టల్ లో ఉండే మహిళలు తమకు ఈ విషయాలు తెలియవని, హాస్టల్ కాళీ చేయడానికి టైం కావాలని అడగగా, సోమవారం వరకు టైం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం హాస్టల్ సీజ్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్