అమెరికాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం

2చూసినవారు
అమెరికాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం
అమెరికాలోని లూసియానాలో, టోరోడో పార్కులోని సెబాన్ చెరువు వద్ద విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అనురూప్ రెడ్డి అనే యువకుడు, నీటిలో మునిగిపోతున్న తన ముగ్గురు స్నేహితులను కాపాడే ప్రయత్నంలో చేపల వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు గమనించి అతన్ని ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అనురూప్ రెడ్డి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్