100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

3చూసినవారు
100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
శనివారం, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్‌లో ఉషముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు జరుగుతున్న 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ట్రాఫిక్ సమస్యల నివారణకు ఈ విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. రహదారికి అడ్డుగా ఉన్న బండరాళ్లు, చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులు పూర్తయ్యాయని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్