కూకట్‌పల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ జలవాయు విహార్ కాలనీలో జరుగుతున్న స్టార్మ్ వాటర్ పైప్‌లైన్ పునర్నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పరిశీలించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలో జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.