కూకట్‌పల్లి: నిరుపేదలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే

84చూసినవారు
కూకట్‌పల్లి: నిరుపేదలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కూకట్‌పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ లో నివాసముంటున్న వెంకట్ రెడ్డికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన రెండు లక్షల 50 వేల రూపాయల సహాయనిధి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ శుక్రవారం అందజేశారు. పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్