కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పార్టీ జెండాను ఆవిష్కరించి,
బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తుంచుకున్నారని, రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.