కేపీహెచ్‌బీలో క్షత్రియ క్రీడోత్సవం ప్రారంభం

1చూసినవారు
కేపీహెచ్‌బీలో క్షత్రియ క్రీడోత్సవం ప్రారంభం
కూకట్‌పల్లి నియోజకవర్గం, కేపీహెచ్‌బీలోని అల్లూరి సీతారామరాజు స్పోర్ట్స్ గ్రౌండ్‌లో శనివారం క్షత్రియ క్రీడోత్సవం ఘనంగా ప్రారంభమైంది. డీవీఎస్ వర్మ జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, పిల్లలను చదువుతో పాటు ఆటల వైపు కూడా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్