కూకట్‌పల్లి నియోజకవర్గం వై జంక్షన్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం వై జంక్షన్ దగ్గర కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. రమేష్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని తెలిపారు.