కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న అనిత(23) అనే యువతి తాను పనిచేస్తున్న కంపెనీ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరుకు చెందిన అనితకు వివాహమై, ఒక పాప ఉంది. ఆమె భర్త ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, అనిత కేపీహెచ్బీలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. తోటి ఉద్యోగులు, స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనిత తల్లి రాధ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.