శివుడి కరుణతో పల్లెలు సుభిక్షం – ఎమ్మెల్యే మాధవరం ఆకాంక్ష

2చూసినవారు
శివుడి కరుణతో పల్లెలు సుభిక్షం – ఎమ్మెల్యే మాధవరం ఆకాంక్ష
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో ఆదివారం ఉమా రామలింగేశ్వర స్వామి నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్లు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్