హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రైవేటు ఉద్యోగికి, చిరువ్యాపారికి వచ్చిన నకిలీ బెదిరింపు ఫోన్‌కాల్స్‌తో సామాన్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రుణయాప్‌ల నుంచి అప్పులు తీసుకున్నారని, గడువులోపు చెల్లించకపోతే ఖాతాలు సీజ్ చేస్తామని, డబ్బు జమ చేసుకుంటామని బెదిరింపులు వస్తున్నాయి. ఒక ఉద్యోగి భయంతో ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేసుకోగా, మరో వ్యాపారి రూ.20వేలు చెల్లించి బయటపడ్డాడు. నకిలీ కాల్‌సెంటర్ల నుంచి వచ్చే ఇలాంటి బెదిరింపులకు స్పందించవద్దని పోలీసులు సూచించారు.