ఇందిరానగర్ యూ-టర్న్ వద్ద లారీ ఢీ – పాదచారి మృతి

13చూసినవారు
ఇందిరానగర్ యూ-టర్న్ వద్ద లారీ ఢీ – పాదచారి మృతి
కూకట్‌పల్లి నియోజక వర్గం బాలానగర్ ప్రధాన రహదారిపై ఇందిరానగర్ యూ-టర్న్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బానోత్ కిషన్ (45) అనే పాదచారి మృతి చెందాడు. బాలానగర్ నుంచి వై జంక్షన్ వైపు వెళ్తున్న అతివేగ లారీ రోడ్డు దాటుతున్న కిషన్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా ఆయన ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఈ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్