రూ. 10 మెంతి కూర.. అమెరికాలో రూ. 600

4చూసినవారు
భారత్, అమెరికా మధ్య నిత్యావసర ధరల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దేశీయంగా 10 రూపాయలకు లభించే మెంతి కూర కట్ట, అమెరికాలో 600 రూపాయల (7 డాలర్లు) వరకు పలుకుతోందని ఓ ఎన్నారై మహిళ తెలిపారు. రవాణా, ప్యాకేజింగ్ ఖర్చుల వల్ల అక్కడ ఆకుకూరల ధరలు అధికంగా ఉంటున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యత్యాసంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్