కూకట్‌పల్లి నియోజకవర్గంలో పనిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడు భగవాన్ కుటుంబానికి రూ. 7.50 లక్షల నష్టపరిహారం అందింది. బీఆర్‌టీయూ నాయకుడు రవి చొరవతో యాజమాన్యంతో చర్చలు జరిపి చెక్కును అందజేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ భగవాన్ మృతి చెందగా, భార్యా పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆపదలో అండగా నిలిచిన రవికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.