ఆలయ పరిసరాల్లో పారిశుధ్య మెరుపు

0చూసినవారు
ఆలయ పరిసరాల్లో పారిశుధ్య మెరుపు
కూకట్‌పల్లి నియోజకవర్గం, భాగ్యనగర్ డివిజన్ (244)లోని సాయిబాబా ఆలయం వద్ద మంగళవారం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ (జీవీపీ)ను అధికారులు తొలగించారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆల్విన్ కాలనీ సర్కిల్-51 డీసీ చాముండేశ్వరి పర్యవేక్షణలో ఈ స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. ఏసీ శానిటేషన్, ఎస్‌ఆర్‌పీ, ఎస్‌ఎఫ్‌ఏ బృందాలు, ఆర్‌డబ్ల్యూఏ సభ్యులు పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేసి పునరుద్ధరించారు. నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు జీవీపీలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు, ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్