కాకతీయ నగర్‌లో శానిటేషన్ తనిఖీ

9చూసినవారు
కాకతీయ నగర్‌లో శానిటేషన్ తనిఖీ
కూకట్‌పల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ సర్కిల్-25 పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, యల్లమ్మబండ సెకండరీ ట్రాన్స్‌వర్స్ స్టేషన్‌ను బుధవారం అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధులను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని రాంకీ సిబ్బందికి ఆయన సూచించారు. వర్షాకాలంలో పారిశుధ్య లోపాలు లేకుండా చూడాలని, చెత్త పేరుకుపోతే వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్