శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి NTR పేరు పెట్టాలి: BRS MLA

1చూసినవారు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరును తిరిగి పెట్టాలని BRS ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వసంత్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడిన ఆయన, తన తొలి ఓటు టీడీపీకే వేశానని, అందుకు కారణం ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. KPHBలోని 3 ఎకరాల్లో BRS హయాంలో ఎన్టీఆర్ పేరుతో ప్రారంభించిన పాఠశాల భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.