
ఏపీలో రెండు రోజులపాలు కొన్ని జిల్లాల్లో వర్షాలు.. మరో వైపు ఎండలు
ఏపీలో మరో రెండు రోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉండనుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రతరం కానున్నాయి. ముఖ్యంగా బుధవారం ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ నెల 7వ తేదీన కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా. ఈ నెల 8వ తేదీన ఉత్తరాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, ఈ నెల 8వ తేదీ వరకు గోకవరం, జగ్గంపేట, చింతూరు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.




