రోడ్లపై నిర్మాణ వ్యర్థాలపై కఠిన చర్యలు

0చూసినవారు
రోడ్లపై నిర్మాణ వ్యర్థాలపై కఠిన చర్యలు
కూకట్‌పల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ సర్కిల్ 51 పరిధిలోని వివేకానంద నగర్ కమాన్ వద్ద పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను డీసీ చాముండేశ్వరి తనిఖీ చేసి వెంటనే తొలగించాలని ఆదేశించారు. వెంకటేశ్వర నగర్‌లో గతంలో శుభ్రం చేసిన ప్రాంతాల్లో మళ్లీ చెత్త వేయకుండా నిరంతర నిఘా ఉంచాలని, రోడ్లపై శిథిలాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చెత్తను మున్సిపల్ వాహనాలకు మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్