ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఆరెకపూడి గాంధీ

8చూసినవారు
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఆరెకపూడి గాంధీ
కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎంటీ హిల్స్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుకు ఘన సన్మానం జరిగింది. స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్