కూకట్‌పల్లి రామాలయంలో గరుడ–హనుమద్ విగ్రహ ప్రతిష్ఠాపన వైభవం

1చూసినవారు
కూకట్‌పల్లి రామాలయంలో గరుడ–హనుమద్ విగ్రహ ప్రతిష్ఠాపన వైభవం
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని రామాలయంలో గరుడ, హనుమద్ మూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ క్రతువులకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్