కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైతలాపూర్‌లో నివాసముంటున్న దంపతుల మధ్య తలెత్తిన కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. కోపంతో భర్త రహీం తన భార్య సుమేరాను దారుణంగా హత్య చేశాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన రహీం, హత్య అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.