డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్

2చూసినవారు
డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, సీనియర్ సిటిజన్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.1.92 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నవంబర్ 7 నుంచి 14వ తేదీ వరకు చాగంటీ హనుమంతరావు అనే వ్యక్తిని ఆధార్ కార్డ్ దుర్వినియోగం కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారుల పేరుతో బెదిరించి, నకిలీ ఎఫ్ఐఆర్ పంపి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు వినిత్ రాజ్, తిరుపతయ్య, విశ్వనాధ్‌లను అరెస్ట్ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 5 కేసులున్నాయి. ప్రధాన నిందితుడు సందీప్ అలియాస్ అలెక్స్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదైన రెండు వారాలలో నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.