డబ్బుల గొడవలో యువకుడి హత్య

5చూసినవారు
డబ్బుల గొడవలో యువకుడి హత్య
కూకట్‌పల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే గదిలో నివసిస్తున్న ముఖేష్, ఖాన్ మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఆగ్రహానికి గురైన ఖాన్ కత్తితో ముఖేష్ ఛాతిపై పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్