కేపీహెచ్‌బీలో స్కూల్ బస్సు ఢీకొట్టడంతో సతీష్ రెడ్డి (30) అనే యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న సతీష్‌ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన స్థానిక ఎస్ఎంఆర్ అపార్ట్‌మెంట్ వద్ద చోటుచేసుకుంది.