
మెట్రో సర్వీసుల టైమింగ్స్ మార్పు: ఇకపై వారంలో అన్ని రోజులు ఒకేలా
హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో కీలక మార్పులు చేశారు. నవంబర్ 3 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై వారంలో అన్ని రోజులు (సోమవారం నుంచి ఆదివారం వరకు) మెట్రో సర్వీసులు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడుస్తాయి. గతంలో వారాంతాల్లో, పనిదినాల్లో వేర్వేరు సమయాల్లో నడిచేవి. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది.








































