ఫాల్కన్ కంపెనీ విమానాన్ని వేలానికి పెట్టిన ఈడి

3చూసినవారు
ఫాల్కన్ కంపెనీ విమానాన్ని వేలానికి పెట్టిన ఈడి
ఫోంజీ స్కామ్ ద్వారా అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ కంపెనీకి చెందిన హాకర్ 800ఏ జెట్ విమానాన్ని హైదరాబాద్ అధికారులు వేలానికి పెట్టారు. రూ.850 కోట్ల ఫాల్కన్ కుంభకోణంలో మార్చి నెలలో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ నెల 7వ తేదీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానాన్ని ప్రదర్శనకు ఉంచి, 9వ తేదీన ఆన్‌లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు ఈడి అధికారులు తెలిపారు. ఫాల్కన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ కుమార్ ఈ జెట్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్