హైదరాబాద్‌లో అరుదైన వాతావరణ దృశ్యం కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వడగళ్ల వర్షంతో, ముఖ్యంగా శంషాబాద్–నాదర్‌గుల్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంచు ముక్కలు పేరుకుపోయాయి. రోడ్డంతా తెల్లగా మారిపోవడంతో హిమాలయాలను తలపించేలా దృశ్యాలు కనిపించాయి. ఈ అరుదైన సన్నివేశాలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పలువురు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. హైదరాబాద్ ఒక్కసారిగా కాశ్మీర్‌లా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.