హైదరాబాద్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొన్న లారీ (వీడియో)

1చూసినవారు
హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (NH65)పై హయత్‌నగర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కంటైనర్ లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టడంతో, కంటైనర్ ఒక వైపు చీలిపోయింది. వెనుక లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్షతగాత్రుడిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్డులోకి మళ్లిస్తున్నారు.

సంబంధిత పోస్ట్