హైదరాబాద్‌లోని చంపాపేట సింగరేణి కాలనీలో మేఘావత్ మహేశ్ అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఒక యువతి ఆత్మహత్య కేసులో జైలుకెళ్లి, ఇటీవల విడుదలైన మహేశ్, మంగళవారం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదలవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనతో కాలనీలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు రంగంలోకి దిగారు.