లాలాగూడ: టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసిన ఆగంతకుడు

589చూసినవారు
లాలాగూడ: టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసిన ఆగంతకుడు
లాలాగూడలోని ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంపై ఓ ఆగంతకుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ సమయంలో షాప్లో ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తుండగా, వారిలో ఒకరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. యజమాని అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్