రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రామచంద్రగూడెంలో చెరువు తెగిపోయింది. గ్రామంలోకి నీరు పోటెత్తడంతో ఇళ్లు మునిగిపోయి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కస్తూర్బా బాలికల పాఠశాల, మోడల్ స్కూల్ కూడా వరదల్లో మునిగిపోవడంతో 475 మంది విద్యార్థులు భవనంపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది నీటిని తరలించే పనులు చేపట్టింది.