పెద్దపులి నాగారంలో ఆటో-కారు ఢీ

4చూసినవారు
పెద్దపులి నాగారంలో ఆటో-కారు ఢీ
మహేశ్వరం మండలంలోని పెద్దపులి నాగారం గ్రామంలో ఉదయం 7-8 గంటల మధ్య ఆటో, కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వాహనాలు నడపడం, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, అనుమతి లేకుండా ఆటోలు పార్కింగ్ చేయడం వంటి కారణాలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ వార్డు సభ్యుడు బూర్గుల రాజు తెలిపారు. బస్ స్టాప్ వద్ద, మహేశ్వరం, శంషాబాద్ మార్గాల్లో ఆటోల పార్కింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బైక్ పై నుండి పడిపోవడం వంటి ప్రమాదాలు పెరిగాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్