జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

125చూసినవారు
రంగారెడ్డి జిల్లా కందుకూరులో మయూరి ఫ్రేస్ చికెన్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్ టైరు పగిలి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కందుకూరు గ్రామానికి చెందిన సురసాని భారత్ రెడ్డి (30) అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాధవంజి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.