రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ పంచాయతీ కార్యదర్శి శరత్, గ్రామంలో ఒక ప్లాట్ సమస్యను పరిష్కరించడానికి రూ. 30,000 డిమాండ్ చేశాడు. బాధితుడు రూ. 20,000 ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ విషయాన్ని బాధితుడు రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కు తెలియజేశాడు. ప్రణాళిక ప్రకారం, బాధితుడు పంచాయతీ కార్యదర్శి శరత్‌కు రూ. 20,000 ఇస్తుండగా, ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి శరత్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.